KMR: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విమర్శించారు. శుక్రవారం పెద్దకొడపగల్ మండలంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్ అందించామన్నారు. ప్రస్తుతం కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ కోతలతో రైతులకు కష్టాలు: మాజీ ఎమ్మెల్యే


