హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొల్లాపూర్‌ యువకుడికి డాక్టరేట్‌

NGKL:  కొల్లాపూర్‌ పట్టణానికి చెందిన బి. మహేశ్‌ హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. ఆచార్య డి. విజయలక్ష్మి పర్యవేక్షణలో 'అనుమాండ్ల భూమయ్య పద్యకావ్యాలు- పరిశీలన' అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహేశ్‌ పార్ట్‌టైం పనులు చేసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్‌ సాధించడం విశేషం.