ప్రకాశం: టంగుటూరు(M) మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి వద్ద నుంచి 22 క్వాటర్ల మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత స్థానిక పోలీసులకు మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అప్పగించి కేసు నమోదు చేయించారు. మద్యం బెల్ట్ షాపులు నిర్వహించడం నేరమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్


