హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి నాయకుల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: యర్రగొండపాలెం మండల కూటమి నాయకుల సర్వసభ్య సమావేశం శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరై స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు