హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

NRML: నిర్మల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని గాజులపేటలో శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. నిర్మల్ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పలు ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరు చేయించామన్నారు.