హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫతేపురంలో వైభవంగా సరస్వతీ పూజలు

W.G: నిడమర్రు మండలం ఫతేపురంలో దేవీ నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులతో సామూహిక పూజలు చేయించారు. అర్చకులు కామేశ్వర శర్మ, పవన్ కుమార్ శర్మ విశేష హారతులు సమర్పించారు.