హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాలలో అఖిలపక్ష సమావేశం

HNK: పరకాల మున్సిపాలిటీలో ఛైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. పరకాల ఆర్డిఓ వెంకన్న, ACP సతీష్ బాబు, మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, సీఐ ప్రవీణ్ కుమార్, అర్చకులు పాల్గొన్నారు.