అన్నమయ్య: తంబళ్లపల్లెలోని ప్రభుత్వాసుపత్రిలో శనివారం మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారి తేజస్వి తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణులు హాజరవుతారన్నారు. ఉదయం 10 గంటలకు శిబిరం మొదలవుతుందన్నారు. వైద్య పరీక్షలు, చికిత్సలకు వచ్చే వారు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మెగా ఉచిత వైద్య, రక్తదానశిబిరం


