SRD: కంగ్టి మండలం ఏంకేమూరి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దుర్గాభవాని మండపంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు, ముత్తయిదువులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. భక్తుల పూజలతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తెలంగాణ
వైభవంగా సామూహిక కుంకుమార్చన


