హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం

SKLM: బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.