హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంటలు కోతకొచ్చే వరకు విద్యుత్ ఇవ్వాలి'

RR: వరి పంటలు కోతకు వచ్చే వరకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య డిమాండ్ చేశారు. ఫరూక్‌నగర్ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఎల్ నినో కరువు నివారణ చర్యలు చేపట్టాలని, సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ జీవో 641ను రద్దు చేయాలని, 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.