KRNL: దేవనకొండ మండలం లక్కందిన్నె గ్రామంలో తాగునీటి సమస్యపై జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈ, ఇతర అధికారులు గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిశీలించారు. రెండు రోజుల్లో తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి స్పందించిన అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లక్కందిన్నె తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు


