ASR: హుకుంపేట మండలంలోని మఠం-గొచ్చారిగూడ మీదుగా హుకుంపేట, బర్మానుగూడ వెళ్లే ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్పందించిన గూడ గ్రామ యువకులు, ఉద్యోగస్తులు ఇవాళ స్వచ్ఛందంగా గుంతలను మట్టితో పూడ్చి మరమ్మతులు చేపట్టారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గూడ యువత సేవాభావం.. రహదారి మరమ్మతులు!


