NDL: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం ఉదయం 63.1940 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, నీటిమట్టం 885 అడుగులకు గాను 840.90 అడుగులుగా నమోదైంది. జలాశయానికి వరద ప్రవాహం లేదు. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో తాగు, సాగునీటి కష్టాలు తప్పవేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో 63.19 టీఎంసీల నీటి నిల్వ


