హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఆఫీస్ వద్ద పోలీసుల మోహరింపు

చీరాల మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు, అనుచరుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నెల 28న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.