హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటకులతో కిటకిటలాడుతున్న జలపాతాలు

VSP: దసరా సెలవుల నేపథ్యంలో మన్యం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ప్రకృతి అందాలు, జలపాతాలు, తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. అరకు, అనంతగిరి, లంబసింగిలోని పర్యాటక రిసార్టుల గదులు ఈనెల 20 వరకు బుక్‌ అయ్యాయి. బొర్రా గుహలు, వంజంగి హిల్స్‌, కొత్తపల్లి జలపాతం, తాజంగి రిజర్వాయర్‌ ప్రాంతాల్లో సందడి నెలకొంది.