హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఎంపీడీవో ఆఫీస్‌లో ఆసక్తికర నోటీసు

BPT: దసరా పండుగ వేళ బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీవో కార్యాలయం ఆసక్తికరమైన నిర్ణయంతో నిలిచింది. "దయచేసి దసరా మామూళ్లు, ఎటువంటి చందాల కోసం ఈ కార్యాలయంలోకి రావద్దు" అంటూ ఏర్పాటు చేసిన నోటీసు బోర్డు స్థానికంగా చర్చనీయాంశమైంది. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ బోర్డును ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. మామూళ్ల కోసం వచ్చే వారికి ఈ నోటీసు హెచ్చరికగా నిలుస్తోంది.