KNR: హుజురాబాద్ మండలం శాలపల్లి వద్ద అదుపుతప్పి టాటా టియాగో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం. క్షతగాత్రులను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు జమ్మికుంట, వీణవంక మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
తెలంగాణ
టియాగో కారు బోల్తా.. ఒకరు మృతి


