హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సమాచారం ఇస్తే రివార్డు: ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాల అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌తో తనిఖీలు, నాలుగు ప్రాంతాల్లో 24 గంటల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి రవాణాపై ఖచ్చితమైన సమాచారం అందించే వారికి రివార్డు ఇస్తామని, ప్రజలు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.