ADB: ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామానికి చెందిన వినోద్ యశ్వంత్ జాదవ్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శుక్రవారం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి సోదరుడు సంతోష్ జాదవ్ను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఆత్రం సుగుణ పరామర్శ


