హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అమ్మవారి అలంకరణ

NGKL: కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రూ. 55,55,555 నగదు నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు జూలూరు రమేష్ బాబు తెలిపారు.