హైదరాబాద్: 28°C
క్రీడలు

రాయ్‌పూర్‌లో మ్యాచ్‌లు.. ఫ్రీ ఎంట్రీ

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో భారత్-జింబాబ్వే మహిళల టీ20 సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. సీఎం సూచన మేరకు స్టేడియానికి వచ్చే మహిళా ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 16, 18, 20 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్‌ను మరింత ప్రోత్సహించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.