HYD: సనత్నగర్ నియోజకవర్గంలోని బోయిగూడ ఐడీహెచ్ కాలనీలో మంచినీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటుతుండగా, నగరంలో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. కొందరు పైపులతో వాహనాలు కడుగుతూ, గంటల తరబడి దుస్తులు ఉతుకుతూ, వాకిళ్లు శుభ్రం చేస్తూ నీటిని వృథా చేస్తున్నారు.
తెలంగాణ
మంచినీటి వృథా.. పట్టించుకోని అధికారులు!


