హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెలవెలబోతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు

SRCL: జిల్లా కోనరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల రాశులతో కళకళలాడాల్సి ఉండగా వెలవెలబోతున్నాయి. మరోవైపు దళారులు కల్లాల్లోనే సన్న ధాన్యాన్ని క్వింటాలుకు రూ.3,050–3,200, దొడ్డు రకాన్ని రూ.2,200–2,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర, బోనస్ కలిపినా రూ.3 వేల ఆదాయం రావడం లేదని రైతులు చెబుతున్నారు.