హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కేంద్రంగా అర్బన్ హెల్త్సెంటర్

అన్నమయ్య: మదనపల్లెలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ శివనారాయణశర్మ పట్టణంలోని కోమిటి వాని చెరువుకు ఆనుకుని ఉన్న దొంతివీధి అర్బన్ హెల్త్ సెంటర్ను కేటాయించారు. ఇన్నాళ్లు మున్సిపల్ కార్యాలయంలోనే ఎన్నికలు జరిగేవి. అయితే అక్కడ స్థలం సరిపడదని ఎన్నికల కేంద్రాన్ని మార్చి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.