హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మద్యం తాగి వాహనాలు నడపవద్దు'

MNCL: వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో పోలీసులు పెట్రోలింగ్ తో పాటు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు.