SRD: సిర్గాపూర్ మండలం తోల్యా తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తండాలో నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం ఇవాళ ఉదయం కిలోమీటరు దూరంలో ఉన్న సోలార్ ప్లాంట్ వద్దకు వెళ్లి ఎడ్ల బండి పై నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
తాగునీటి కోసం ఎడ్ల బండి ప్రయాణం!


