WGL: వర్ధన్నపేట పట్టణంలోని రెండో వార్డులో శుక్రవారం తెల్లవారుజామున అరుదైన రెండు తలల పాము ప్రత్యక్షమైంది. పామును గమనించిన హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పామును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో పామును విడిచిపెడతామని ఫారెస్ట్ రేంజర్ తెలిపారు.
తెలంగాణ
వర్ధన్నపేటలో రెండు తలల పాము


