WGL: నగరంలోని రామన్నపేటలో ఇంటి ముందు నిలిపిన ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి డ్రైవర్ తన ఇంటి ఎదుట ఆటోను పార్క్ చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం బయటకు వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. దీంతో బాధితుడు మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆటో ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
ఇంటి ముందు ఆటో చోరీ


