హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు నీటి నిర్వహణకు ఇంకుడు గుంతలు

NRML: గ్రామాల్లో మురుగు నీటిని భూమిలోకి ఇంకించేలా స్వచ్ఛ భారత్ మిషన్‌ (ఎస్బీఎం) పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. అధికంగా మురుగు నీరు పారే కాలువల పక్కన వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గుంతకు రూ.లక్ష చొప్పున కడెం మండలానికి 25 మంజూరయ్యాయి. మండలంలోని చిన్నబెల్లాల్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఇప్పటికే ఏడు ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయింది.