హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని సరస్వతి దేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.