NRML: కుభీరు మండలం రాజురా గ్రామంలో 2019లో 23 మంది లబ్ధిదారుల కోసం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇళ్లను మంజూరు చేయగా, ప్రస్తుతం పైకప్పు వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఇళ్ల సముదాయాల్లో పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగిపోయాయి.
తెలంగాణ
అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్లు


