హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సేవించిన ఇద్దరు యువకులు పట్టివేత

SRCL: ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె సమీపంలోని అనంతగిరి ప్రాజెక్టు వద్ద గంజాయి సేవించిన ఇద్దరు యువకులను పోలీసులు గురువారం పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా కిష్టాపూర్‌కు చెందిన పిండి అనిల్ (25), బండిపెల్లి సాయికిరణ్ (29) పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో కేసు నమోదు చేసి సిరిసిల్ల పునరావాస కేంద్రానికి తరలించినట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు.