హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మీ-సేవా అనుమతులు రద్దు చేయాలి'

MLG: మంగపేటలో మీ-సేవా కేంద్రాల నిర్వహణపై గురువారం SFI జిల్లాకార్యదర్శి రవి స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాలు నడుస్తున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రాల చిరునామాలు, అనుమతులను తనిఖీ చేసి, నిర్లక్ష్యం వహించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన కేంద్రాల అనుమతులు రద్దు చేయాలన్నారు.