హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

CTR: వరదయ్య పాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన రమణయ్య నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శ్రీ సిటీలోని ఓ కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. విధులకు వెళ్తుండగా చలమత్తూరు క్రాస్ రోడ్డు వద్ద ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమణయ్యను శ్రీసిటీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.