హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి మేయర్ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ!

VZM: నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి ఎంపికపై కూటమిలో ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ తరఫున సిరి సహస్ర పేరు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ తమ మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి పేరును అధికారికంగా ప్రకటించడంతో అందరి దృష్టి కూటమి నిర్ణయంపై పడింది. నేడు సాయంత్రానికి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.