హైదరాబాద్: 28°C
తెలంగాణ

అపరిశుభ్రంగా ప్రధాన రహదారి

PDPL: గోదావరిఖనిలోని నగరపాలక వాణిజ్య భవన సముదాయం వెనుక ప్రధాన రహదారిపై పలుచోట్ల చెత్తకుప్పలు పేరుకుపోయింది. కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండటంతో అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్ష్మీనగర్ నుంచి ప్రధాన కూడలికి వెళ్లేందుకు ఇదే దగ్గరి మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.