హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేసవి తాగునీటి కొరత రాకుండా ముందస్తు కార్యాచరణ

NRPT: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు పడిపోతున్నందున, వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. అక్టోబరులోనే బోర్లు ఎండిపోతుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.