హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి వనరుల పరిరక్షణపై ఇరిగేషన్ శాఖ దృష్టి

ADB: బజార్ఆత్నూర్ మండలంలో వర్షపాతం లోటు ఏర్పడటంతో నీటి వనరుల పరిరక్షణపై ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. తాగునీరు, పశువుల అవసరాల కోసం నీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యామ్లు, వాగుల నుంచి అనుమతి లేకుండా మోటార్లతో నీటిని తోడవద్దని నోటీసులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.