హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో పడి రైతు మృతి

NZB: ఎడపల్లి (M)లోని అంబం గ్రామానికి చెందిన వెంకటి గురువారం చెరువులో పడి మృతి చెందారు. గ్రామ శివారులోని చెరువు వద్ద ఒడి బియ్యం వదిలేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.