హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా పండుగ ఏర్పాట్ల పరిశీలన

SRPT: దసరా పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో చేపడుతున్న ఏర్పాట్లు, పనులను మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్, ఎస్సై పరిశీలించారు. పండుగకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశుధ్యం, రహదారులు, భద్రతా చర్యలపై దృష్టి సారించి పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు.