హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరస్వతి దేవి అలంకరణలో గంగానమ్మ

ELR: జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. సాయంత్రం చిన్నారులతో సరస్వతి పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది.