MDCL: మేడ్చల్ ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం బాలికలపై లైంగిక వేధింపుల కేసులో దాకూరి దశరథ్ అనే వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్నగర్కు చెందిన దశరథ్ ఇద్దరు బాలికలకు అసభ్య వీడియోలు చూపించి వేధించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేయగా, కోర్టు తీర్పు వెలువరించింది.
తెలంగాణ
బాలికల వేధింపుల కేసులో రెండేళ్ల జైలు


