ELR: భీమడోలు అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడకు కాలినడకన వెళ్తున్న ముగ్గురు భవానీ భక్తులను వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తాడేపల్లిగూడెం మండలం దండగర్రకు చెందిన ఇద్దరు యువకుల కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రంగా గాయలు


