హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికల హాస్టల్ పక్కన వైన్ షాప్‌పై ఆందోళన

KRNL: ఎమ్మిగనూరులో సూర్య వైన్ షాప్ పక్కనే ఎస్సీ బాలికల హాస్టల్ ఉండటంపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాము, డీవైఎఫ్‌ఐ పట్టణ కన్వీనర్ విజయ్ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థినులు ఇంటర్,డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నారని, వారికి తగిన భద్రత కల్పించడం అధికారుల బాధ్యతని పేర్కొన్నారు. బాలికలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.