హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు సీజ్

HNK: కమలాపూర్ మండలంలోని ఉప్పల్ వద్ద అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన నరేశ్, శివ అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు సీఐ నవీన్ గురువారం తెలిపారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.