RR: మంచాల మండలంలోని ఆరుట్ల-తిప్పాయిగూడ రహదారి గుంతలమయంగా మారడంతో పాటు కంకర తేలింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కలిపే ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు దుస్థితితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా మారిన ప్రధాన రహదారి


