హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం.. తప్పిన ప్రమాదం

జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గురువారం రన్నింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు స్కూటీని నిలిపి వెంటనే దూరంగా పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎండల తీవ్రతతో వాహనాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయంటూ పలువురు చర్చించుకుంటున్నారు.