హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం

NTR: మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. ఉచిత దర్శన క్యూలైన్లలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.