హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి

SRCL: ఆరెపల్లి గ్రామంలో వేములవాడ వ్యవసాయ అధికారి శ్వేత గురువారం వరి పంటను పరిశీలించారు. పంటలో కంకి నల్లి, గింజ రంగు మారడం వంటి సమస్యలను గుర్తించారు. కంకి నల్లి నివారణకు లీటరు నీటికి 0.8 మి.లీ. స్పైరోమెసిఫెన్, గింజ రంగు మారకుండా ఉండేందుకు 1.75 గ్రాముల నేటివో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పంటలో తెగుళ్ల లక్షణాలను గుర్తించాలన్నారు.